డ్రగ్‌ కేసు: బాలీవుడ్‌ తారల విచారణ పూర్తి - deepika Sara and Shraddha leave Narcotics Control Bureau zonal office
close
Published : 26/09/2020 21:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డ్రగ్‌ కేసు: బాలీవుడ్‌ తారల విచారణ పూర్తి

వారి సమాధానం ఇదేనా..?

ముంబయి: నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు బాలీవుడ్‌ కథానాయికలు దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌, సారా అలీ ఖాన్‌ను శనివారం విచారించారు. శుక్రవారం రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను దాదాపు నాలుగు గంటలపాటు విచారించిన అధికారులు ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు వెల్లడించారు. దాన్ని విశ్లేషించి, కోర్టుకు సమర్పించబోతున్నట్లు తెలిపారు. డ్రగ్‌ చాటింగ్‌ చేశానని, కానీ తీసుకోలేదని రకుల్‌ అన్నట్లు తెలిసింది. కాగా శనివారం ఉదయం దీపికను ఐదు గంటలు.. శ్రద్ధను ఆరు గంటలు విచారించారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సారా కూడా విచారణ పూర్తి చేసుకుని, ఇంటికి వెళ్లారు.

తన మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌తో 2017లో డ్రగ్‌ చాటింగ్‌ చేశానని దీపిక ఒప్పుకున్నట్లు తెలిసింది. కానీ సేవించలేదని చెప్పారట. సుశాంత్‌ ఏర్పాటు చేసిన పార్టీకి మాత్రం హాజరయ్యామని, డ్రగ్‌ తీసుకోలేదని శ్రద్ధ, సారా చెప్పినట్లు ఆంగ్ల వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. సుశాంత్‌ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీలకు వెళ్లానని సారా అన్నారట. సిగరెట్‌ మాత్రమే తాగానని, డ్రగ్‌ తీసుకోలేదని ఆమె చెప్పినట్లు సమాచారం. ‘కేదార్‌నాథ్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో ఆయనతో సన్నిహితంగా ఉన్నట్లు సారా ఒప్పుకున్నారట. మరోపక్క సుశాంత్‌ తన వ్యానులో డ్రగ్‌ తీసుకోవడం చూశానని శ్రద్ధ అధికారులకు చెప్పినట్లు తెలిసింది.

జూన్‌ 14న సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ హఠాన్మరణం అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తిని విచారించగా ఆమె కొందరితో డ్రగ్‌ చాటింగ్‌ చేసినట్లు బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌సీబీ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. రియా స్టేట్‌మెంట్‌ ప్రకారం విచారిస్తోంది. ఇప్పటికే రియాతోపాటు 16 మందిని అరెస్టు చేసినట్లు తెలిసింది. విచారణ క్రమంలో రియా బాలీవుడ్‌ తారల పేర్లు చెప్పడంతో అధికారులు వారికి సమన్లు జారీ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని