అవే ఇషాన్‌ను వేరు చేస్తాయి: డీకే - dinesh karthik point outs ishan kishans speciality
close
Published : 15/03/2021 20:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవే ఇషాన్‌ను వేరు చేస్తాయి: డీకే

ఇంటర్నెట్‌డెస్క్‌: మొతేరా వేదికగా జరిగిన రెండో టీ20లో ఇషాన్ ‌కిషన్‌ (56; 32 బంతుల్లో 5x4, 4x6) అరంగేట్రం మ్యాచ్‌లోనే దంచికొట్టాడు. అందరి చేతా శెభాష్‌ అనిపించుకున్నాడు. తనదైన షాట్లతో అలరించిన అతడు తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే అర్ధశతకంతో మెరిశాడు. ఆదిలోనే రాహుల్‌ (0) పెవిలియన్‌ చేరినా.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (73*; 49 బంతుల్లో 5x4, 3x6)తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించాడు. దూకుడుగా ఆడి ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలోనే రెండో వికెట్‌కు కీలకమైన 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం ఇషాన్‌ ఔటైనా కోహ్లీ టీమ్‌ఇండియాను విజయతీరాలకు చేర్చాడు.

ఈ నేపథ్యంలో ఇషాన్‌ బ్యాటింగ్‌పై స్పందించిన దినేశ్‌ కార్తీక్‌ సోమవారం ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశాడు. ఇతరులతో పోలిస్తే ఇషాన్‌ను వేరుగా చేసే విషయాలేమిటో వివరించాడు. ‘నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ కొన్ని అత్యద్భుతమైన షాట్లు ఆడాడు. అతడు ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విధానం.. ఆత్మవిశ్వాసం.. ఎలాంటి బంతులనైనా అలవోకగా సిక్సర్లుగా మలిచే అతడి సామర్థ్యంపై ఉన్న నమ్మకం.. లాంటి విషయాలు ఇతరులతో అతడిని వేరు చేస్తాయి. పవర్‌ హిట్టర్‌ అంటే ఇలాగే ఉండాలి. టాప్‌ ఆర్డర్‌లో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి తెచ్చే బ్యాట్స్‌మన్‌ కావాలి. జోఫ్రా ఆర్చర్‌పై తొలి బంతి నుంచే ఇషాన్‌ ఒత్తిడి తెచ్చాడనుకుంటా. అదో శుభపరిణామం’ అని డీకే తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని