టోక్యో సమీపంలో భూకంపం - earthquake with magnitude 7 strikes near tokyo japan
close
Published : 13/02/2021 22:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టోక్యో సమీపంలో భూకంపం

టోక్యో: జపాన్‌ రాజధాని టోక్యో నగరానికి సమీపంలో శనివారం భూపంకం సంభవించింది. జపాన్‌ వాతావరణ సంస్థ ట్విటర్‌ ద్వారా ఈ విషయం వెల్లడించింది. టోక్యో నగరానికి ఈశాన్యంగా 306 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం దాదాపు 7:37 గంటలకు ఈ భూప్రకంపనలు సంభవించినట్లు వెల్లడించింది. భూకంపం తీవ్రత 7.0గా నమోదైనట్లు పేర్కొంది. భూ ఉపరితలం నుంచి 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూప్రకంపనల వల్ల ఇళ్లలోని వస్తువులు కదిలినట్లు పలువురు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేశారు.

ఇదీచదవండి

ఢోబాల్‌ ఇంటిపై ఉగ్రవాదుల రెక్కీ!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని