‘హోం ఐసోలేషన్‌ బాధితులను పర్యవేక్షించాలి’ - eetala rajender review with hospitals officials
close
Published : 06/08/2020 19:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘హోం ఐసోలేషన్‌ బాధితులను పర్యవేక్షించాలి’

తెలంగాణ మంత్రి ఈటల

హైదరాబాద్‌: కరోనా చికిత్స విషయంలో కలెక్టర్లు, మంత్రుల సూచనలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ ఆస్పత్రి వర్గాలకు సూచించారు. కరోనా చికిత్సల విషయంపై జిల్లా కలెక్టర్లు, వైద్యాధికారుల, ప్రభుత్వాస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి ఈటల, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా బాధితులను నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. వైద్యుల నుంచి సరైన కౌన్సెలింగ్‌ అందేలా చూడాలన్నారు. బాధితులందరికీ సరైన వైద్యం అందేలా కలెక్టర్లు చూడాలని ఆదేశించారు.

అనంతరం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌ పరీక్షలకు వచ్చే వారి వివరాలు యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. పాజిటివ్‌ వస్తే అక్కడే కిట్‌ ఇచ్చి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని వైద్యాధికారులను ఆదేశించారు. హోం ఐసోలేషన్‌ కిట్‌లోని ఔషధాల వివరాలతో సర్క్యులర్‌ రూపొందించాలని, కరోనా చికిత్సకు ప్రోటోకాల్‌ మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించారు. కరోనాకు సంబంధించి పెండింగ్‌ బిల్లుల వివరాలు ప్రభుత్వానికి పంపాలన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని