TS NEWS: కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్‌ అథారిటీ ఏర్పాటు - establishment of ts pollution control board appellate authority
close
Published : 03/08/2021 20:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS NEWS: కాలుష్య నియంత్రణ మండలి అప్పిలేట్‌ అథారిటీ ఏర్పాటు

హైదరాబాద్‌: ఎట్టకేలకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) అప్పిలేట్‌ అథారిటీ ఏర్పాటైంది. జల, వాయు కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం ఈ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్టు టీఎస్‌పీసీబీ తెలిపింది. అథారిటీ ఛైర్మన్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.ప్రకాశరావును నియమించింది. సభ్యులుగా ఓయూ విశ్రాంత ప్రొఫెసర్‌ వి.ప్రభాకర్‌ రెడ్డి, ఐఐసీటీ శాస్త్రవేత్త డా.జయతీర్థారావు నియమితులయ్యారు. అథారిటీకి గతంలో ఛైర్మన్ గా ఉన్న జస్టిస్ట్ సీవీ రాములు లోకాయక్తగా నియమితులయ్యారు. దీంతో తాజాగా నూతన అప్పీలేట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అందుకు అనుగుణంగా పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని