60వ పడిలో ‘లూసిఫర్‌’ అదిరిపోయే వర్కౌట్స్‌! - exercise keeps the body and mind healthy mohanlal shares fitness video
close
Updated : 22/03/2021 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

60వ పడిలో ‘లూసిఫర్‌’ అదిరిపోయే వర్కౌట్స్‌!

మోహన్‌లాల్‌ కసరత్తుల వీడియో చూశారా..

కొచ్చిన్‌: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పరిపూర్ణ నటుడిగా మోహన్‌లాల్‌కు పేరుంది. మలయాళ సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. వయసు 60 దగ్గరకు చేరుకున్న కుర్ర హీరోలకు దీటుగా స్టంట్స్‌ చేయగలరు. ‘మన్యంపులి’ చిత్రంలో ఆ ఎనర్జీ కనిపిస్తుంది. అందుకు ప్రధాన కారణం ఆయన ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమివ్వటమే. తాజాగా తన అభిమానుల్లో శారీరక దారుఢ్యంపై స్ఫూర్తి నింపేందుకు మూడు నిమిషాల కసరత్తుల వీడియోను ఇటీవల ఇన్‌స్టా ద్వారా షేర్‌ చేశారు.

జిమ్‌లో ట్రైనర్‌ పర్యవేక్షణలో బ్యాటిల్‌ రోప్‌, లిఫ్టింగ్స్‌, బెంచ్‌ ప్రెస్‌, క్రంచస్‌ వంటి కసరత్తులను ‘నెక్స్ట్‌’అంటూ వరుసపెట్టి చేసేశారు. ఆ వీడియోకి క్యాప్షన్‌గా ‘రోజూ కసరత్తుల ద్వారా  దేహంతోపాటు మెదడు ఆరోగ్యంగా ఉంటుంది’ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియోకు చూసిన నెటిజన్లు ‘సూపర్బ్‌ సార్‌’, ‘మీరు స్ఫూర్తివంతం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ వీడియోను 8లక్షలకు పైగా వీక్షించారు. అయిదు సార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న మోహన్‌లాల్‌ ఇటీవల నటించిన ‘దృశ్యం2’ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘అరట్టు’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని