మాస్క్‌ మస్ట్‌: 5 రోజుల్లో 18500 మందికి ఫైన్‌!  - fines for no mask in delhi
close
Updated : 30/03/2021 22:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్క్‌ మస్ట్‌: 5 రోజుల్లో 18500 మందికి ఫైన్‌! 

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో దిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలుచేస్తోంది. వైరస్‌ కట్టడే లక్ష్యంగా కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధిస్తోంది. ఇందులో భాగంగా గత ఐదు రోజుల వ్యవధిలో 18500 మంది నుంచి జరిమానా రూపంలో రూ.3.18 కోట్లు వసూలైనట్టు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో నార్త్‌ దిల్లీలో అత్యధిక మంది ఉండగా.. ఈస్ట్‌ దిల్లీలో అత్యల్పంగా ఉన్నట్టు తెలిపింది. ప్రజలు గుమిగూడకుండా హోలీ, షాబ్‌ఈ బరత్‌ వంటి వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

మరోవైపు, నగరంలో కేసులు పెరిగిపోవడంతో కొన్ని ఆస్పత్రుల్లో సాధారణ, ఐసీయూ పడకల సంఖ్యను పెంచాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్ణయించారు. తద్వారా పడకల లభ్యత మెరుగుపడుతుందన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదని చెప్పారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని