ఇంతకుముందూ ఇదే జరిగింది: సెహ్వాగ్‌  - former cricketers praises ishan kishans debut half century
close
Published : 15/03/2021 18:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంతకుముందూ ఇదే జరిగింది: సెహ్వాగ్‌ 

ఇషాన్‌ కిషన్‌పై మాజీల ప్రశంసలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌కిషన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఇషాన్‌(56; 32 బంతుల్లో 5x4, 4x6) అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆడిన తొలి అంతర్జాతీయ టీ20లోనే అర్ధశతకం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మరీ ముఖ్యంగా తొలి మ్యాచ్‌ ఆడుతున్నాననే భయం, బెరుకు లేకుండా ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుపడ్డాడు. దీంతో అతడి బ్యాటింగ్‌ నైపుణ్యానికి పలువురు మాజీలు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే అతడిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. ఇక టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. ఇషాన్‌ను పొగుడుతూ మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీతో పోల్చాడు. ధోనీ ఝార్ఖండ్‌ నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. అతడు కీపర్‌, బ్యాట్స్‌మన్‌ కూడా. అయితే, దేశవాళి క్రికెట్‌లో ఇషాన్‌ సైతం ఝార్ఖండ్‌ తరఫునే కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్నాడు. ధోనీ టీమ్‌ఇండియాలోకి వచ్చిన కొత్తలో మిడిల్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ నుంచి టాప్‌ఆర్డర్‌లోకి మార్చిన వెంటనే తన అసలు విశ్వరూపం చూపించాడు. ఆపై భారత క్రికెట్‌లో సంచలనాలు సృష్టించాడు. ఈ క్రమంలోనే సెహ్వాగ్‌ ఇప్పుడు ఇషాన్‌ను పొగిడాడు.

* ఝార్ఖండ్‌ నుంచి వచ్చిన ఓ యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోటయ్యాడు. దాంతో అతని శక్తిసామర్థ్యం నిరూపించుకున్నాడు. ఇది గతంలోనూ జరిగింది. భయం లేకుండా ధాటిగా ఆడిన ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ ఎంతో నచ్చింది.    -వీరేంద్ర సెహ్వాగ్‌

* ఇషాన్‌ కిషన్‌కు ఇంతకన్నా డ్రీమ్ అరంగేట్రం మ్యాచ్‌ ఏమి ఉంటుంది? అతడికి ఆట గురించి కొంచెం కూడా భయం లేదు. చిన్న వయసులోనే ఐపీఎల్‌ల్లో ఆడటం వల్ల ఇలాంటి అద్భుతాలే వస్తాయి. పరిస్థితులకు అలవాటు పడి అక్కడికెళ్లి నీ నైపుణ్యాలు ప్రదర్శించడమే.  -యువరాజ్‌ సింగ్‌

* ఇషాన్‌ బాగా ఆడావు. భయం లేకుండా బ్యాటింగ్‌ చేసిన విధానం ఎంతో నచ్చింది. -వీవీఎస్‌ లక్ష్మణ్‌

* టీమ్‌ఇండియా కన్నా ముంబయి ఇండియన్స్‌ అత్యుత్తమం అని ముందే చెప్పా. ఇషాన్‌ కిషన్‌ ఇంతకన్నా మంచి అరంగేట్రం దొరకదు.  -మైఖేల్‌ వాన్‌

* టీమ్‌ఇండియా బాగా ఆడింది. టీ20ల్లో ఐదుగురు బౌలర్లను ఆడించడం అంత తేలిక కాదు. విరాట్‌ బౌలర్లను చక్కగా వినియోగించుకున్నాడు. ఇషాన్ ‌కిషన్‌కు అతిగొప్ప ఆరంభం. గాయం నుంచి కోలుకున్నాక భువిని ఇలా చూడటం బాగుంది.  -ఇర్ఫాన్‌ పఠాన్‌

* అండర్‌-19 నుంచి ఐపీఎల్‌కు. అక్కడి నుంచి టీమ్‌ఇండియాకు. ఇషాన్‌ మరింత ముందుకు సాగు. అత్యున్నత శిఖరాలకు చేరుకో. -మహ్మద్‌ కైఫ్‌

* అత్యద్భుతమైన అరంగేట్రం చేసిన ఇషాన్‌కు అభినందనలు. ఇదో మెరుపు ఇన్నింగ్స్‌.  -ఆర్పీ సింగ్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని