ఏపీ ప్రజలకు ఉచితంగా బియ్యం! - free ration for ap people
close
Published : 26/04/2021 18:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ ప్రజలకు ఉచితంగా బియ్యం!

అమరావతి: కరోనా విపత్కర పరిస్థితుల్లో దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవారికి ఆపన్న హస్తం అందించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. తెల్లరేషన్‌ కార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.47 కోట్ల మంది లబ్ధిదారులకు 2 నెలలపాటు ఉచితంగా బియ్యం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 88 లక్షల మందికి ఉచిత బియ్యం ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం లబ్ధి అందని 59 లక్షల కార్డు దారులకు మే, జూన్‌ నెలలో ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. రేషన్‌ వాహనాల ద్వారానే ఉచిత బియ్యం పంపిణీ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి డబుల్‌ కోటాగా పంపిణీ చేయనున్నారు. బియ్యం పంపిణీ కోసం రూ.764 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని