పదో రోజూ ఇంధన ధరలు పైకే..! - fuel prices hiked consecutive 10th day
close
Updated : 18/02/2021 08:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పదో రోజూ ఇంధన ధరలు పైకే..!

దిల్లీ: దేశంలో ఇంధన ధరల పెరుగుదల రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వరుసగా పదో రోజూ ఇంధన ధరలు పెంచాయి. పెట్రోల్‌పై 34 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గురువారం నిర్ణయించాయి. ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.89.88 కి చేరగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.80.27కి చేరింది. వరుసగా పది రోజుల్లో కలిపి దేశంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.93, డీజిల్‌పై రూ.3.14 చొప్పున పెరిగింది. 

ఇక ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.34, డీజిల్‌ ధర రూ.87.32గా నమోదైంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌ ధర రూ.93.64గా, డీజిల్‌ ధర రూ.87.52గా నమోదైంది. కాగా ఇప్పటికే రాజస్థాన్‌ రాష్ట్రంలోని శ్రీగంగా నగర్‌లో లీటర్‌ సాధారణ పెట్రోల్‌ రికార్డు స్థాయిలో రూ.100 మార్కును చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో రాజస్థాన్‌ పెట్రోల్‌ డీలర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరుసగా పెట్రో ధరల పెంపుతో దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ మాత్రం పెట్రో ధరల పెరుగుదల గత ప్రభుత్వాల పాపమేనని ధ్వజమెత్తారు. బుధవారం తమిళనాట పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన మోదీ.. గత ప్రభుత్వాలు ఇంధన దిగుమతులను తగ్గించడంపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. 

 


 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని