కరోనా ఎఫెక్ట్‌: ఆన్‌లైన్‌ ఆహారసంస్థల చర్యలు
close
Published : 15/03/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఎఫెక్ట్‌: ఆన్‌లైన్‌ ఆహారసంస్థల చర్యలు

‘కాంటాక్ట్‌లెస్‌ డెలివరీ’ విధానంలో ఆహార సరఫరా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం కేవలం ప్రజారోగ్యంపైనే కాకుండా ఇతర రంగాలపైన కూడా పడుతోంది. కరోనా భయంతో బయటి ఆహారాన్ని తినటానికి ప్రజలు సందేహిస్తున్నారు. ఆహారం పరిశుభ్రంగానే ఉన్నా సరఫరా విషయంలో సందేహాలు వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారం అందించేందుకు దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్‌ ఆహార సంస్థలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. బెంగుళూరు కేంద్రంగా ఉన్న ఆహార సరఫరా దిగ్గజం స్విగ్గీ... కరోనా నేపథ్యంలో తాము తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను వివరిస్తూ తమ వినియోగదారులందరికీ  ఇ-మెయిళ్లు పంపించింది. ఇక జొమాటో కూడా దాని బాటలోనే నడుస్తూ అనేక చర్యలు జాగ్రత్త తీసుకుంటోంది. 

ఆహారాన్ని పరోక్షంగా పొందవచ్చు

ఆహారాన్ని ఎంత పరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేసినప్పటికీ దానిని వినియోగదారుడికి అందించే ప్రక్రియ చాలా కీలకం. దీనితో ఈ దిగ్గజ సంస్థలు ఆహారాన్ని సరఫరా చేసే తమ భాగస్వాములు కూడా కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు భద్రతా, శుభ్రతా ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి. వీటిలో భాగంగా వినియోగదారుడు ఆర్డర్‌ చేసిన ఆహార పదార్ధాలను ముఖాముఖి కాకుండా పరోక్షంగా పొందే ‘కాంటాక్ట్‌లెస్‌ డెలివరీ’ సౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ ట్విటర్‌ ద్వారా స్వయంగా వివరించారు. వినియోగదారుడు ఈ సౌకర్యాన్ని ఆహారం ఆర్డర్‌ చేసేప్పుడే ‘డెలివరీ ఇన్‌స్ట్రక్షన్స్‌’ ఫీచర్‌ ద్వారా ఎంచుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ విధానాన్ని ఎంచుకున్నపుడు డెలివరీ ఉద్యోగి తెచ్చిన ఆహారాన్ని వినియోగదారుడి ఇంటి బయటనే ఏదైనా శుభ్రమైన ప్రదేశంలో ఉంచుతాడు. దాని ఫొటో వినియోగదారుడికి అందుతుంది. అనంతరం వినియోగదారుడు తన వీలును బట్టి దానిని తీసుకోవచ్చు. 

సిబ్బందికి ఆరోగ్య బీమా

‘‘డెలివరీ సిబ్బందికి ఏవైనా ఆరోగ్య సమస్యలున్నపుడు వారు తమ ఇళ్లకే పరిమితమయ్యేలా, వైద్యుని సంప్రదించేలా చర్యలు తీసుకుంటున్నాం. వారిలో ఎవరికైనా కొవిడ్‌-19 సోకినట్లయితే, ఆర్థిక కారణాలకు భయపడి పనిచేసే అవసరం కలుగకుండా ఆర్థిక సహకారాన్ని అందిస్తాము. సరఫరా సిబ్బందికి మెడికల్ ఇన్సూరెన్స్‌ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాము.’’ అని దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని