2021 ప్రథమార్థంలో జొమాటో ఐపీఓ
close
Published : 11/09/2020 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2021 ప్రథమార్థంలో జొమాటో ఐపీఓ

దిల్లీ: ఆన్‌లైన్‌ అహార సేవల సంస్థ జొమాటో వచ్చే ఏడాది ప్రథమార్థంలో తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ వెల్లడించారు. తమ ఫైనాన్స్‌, లీగల్‌ బృందాలు ఐపీఓకు కసరత్తు చేస్తున్నాయని ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో తెలిపారు. ‘మా వ్యాపార విలువ గణనీయంగా పెరుగుతోంది. ఉద్యోగుల కృషి, పట్టుదలకు కృతజ్ఞతలు. ప్రస్తుత ఉద్యోగులకు మరింత విలువ చేకూర్చే విధంగా వచ్చే ఏడాది ఈసాప్స్‌ ఇవ్వనున్నాం. ఐపీఓతో సంస్థ విలువ మరింత పెరుగుతుంది’ అని గోయల్‌ పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని