భారత మార్కెట్లోకి ఒప్పొ ఎఫ్‌15..
close
Published : 18/01/2020 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత మార్కెట్లోకి ఒప్పొ ఎఫ్‌15..

దిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో, ‘ఎఫ్‌’ సిరీస్‌ కొనసాగింపులో భాగంగా మరో కొత్త ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఒప్పో ఎఫ్‌15 మొబైల్‌ను సంస్థ గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరను రూ.19,990గా నిర్ణయించింది. జనవరి 24 నుంచి అమెజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లతో పాటు స్టోర్లలోనూ ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 

ఒప్పొ ఎఫ్‌15 ప్రత్యేకతలు
ఒప్పొ ఎఫ్‌15 ఆండ్రాయిడ్‌ 9 పై కలర్‌ ఓఎస్‌ 6.1 సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పనిచేస్తుంది. దీనికి 8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ సదుపాయాన్ని కల్పించారు. ఈ మొబైల్‌కు 20వాట్‌ వీఓఓసీ 3.0 ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వ్యవస్థతో కూడిన 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కల్పించారు. 6.4 అంగుళాల సైజుతో ఫుల్‌ హెచ్‌డీ(1080*2400పిక్సెల్‌) అమోల్డ్‌ డిస్‌ప్లేను అమర్చారు. అక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పీ70 ఎస్ఓసీ ప్రాసెసర్‌ ఇస్తున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే బ్యాక్‌ సైడ్‌ మొత్తం నాలుగు కెమెరాలు ఉన్నాయి. 48 మెగాపిక్సెల్‌ కెమెరా దీనికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మిగిలిన మూడింటిలో ఒకటి 8ఎంపీ, మరో రెండు 2ఎంపీ క్వాలిటీతో అందిస్తున్నారు. ముందువైపు సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్‌ కెమెరా జోడించారు. అదేవిధంగా దీనికి ఫింగర్‌ప్రింట్‌, 4జీ వీఓఎల్టీఈ, వైఫ: 802.11ఏసీ, బ్లూటూత్‌ వర్శన్‌4.2, సీ టైప్‌ యూఎస్‌బీ సహా పలు సౌకర్యాలు అందిస్తున్నారు.  


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని