close

తాజా వార్తలు

నేడు 12 చిత్రాల విడుదల..?

 

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఈ ఏడాది ఆఖరులోపు తమ సినిమాలను విడుదల చేసేయాలన్న తపనతో దర్శక నిర్మాతలు ఉన్నట్లున్నారు. అందుకే శుక్రవారం ఏకంగా 12 చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ చిన్న బడ్జెట్‌ చిత్రాలే కావడం విశేషం. అయితే వీటిలో ఎన్ని చిత్రాలు తెరపైకి వస్తాయో ఇంకా ఖరారు కాకపోవడంతో సినీ జనాలు సైతం గందరగోళానికి గురవుతున్నాయి. కాకపోతే ఈ 12 చిత్రాలకు సంబంధించిన పోస్టర్లు, ప్రచార చిత్రాల్లో మాత్రం శుక్రవారం విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఎస్‌ఏ చంద్రశేఖర్‌ దర్శకత్వంలో జై ప్రధాన పాత్రలో నటించిన ‘కేఫ్‌మారి’ విడుదలవుతోంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని కేసులు నడుస్తున్నాయి. ఆ సమస్యలు గురువారం పరిష్కారం అయ్యాయని, అందువల్ల శుక్రవారం తెరపైకి వస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సుశీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఛాంపియన్‌ చిత్రంలో విశ్వ, మృణాళిని జంటగా నటించారు. నరేన్‌ ప్రధాన పాత్ర పోషించారు. భారతిరాజా కుమారుడు మనోజ్‌ తదితరులు నటించారు. ఈ సినిమా ఖచ్చితంగా విడుదలవుతుందని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇక మనోబాలాతోపాటు ఇతర హాస్య నటులతో తెరకెక్కిన ‘50 రూవా’, ‘చెన్నై టూ బ్యాంకాక్‌’ చిత్రాలు విడుదలవుతున్నాయి. భరత్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘కాళిదాస్‌’ కూడా శుక్రవారం తెరపైకి వస్తోంది. ఇదిలా ఉండగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, ఫోన్ల వాడకంతో మహిళలకు అనర్థాలు వంటి అంశాలపై తెరకెక్కిన ‘కరుత్తుగలై పదివుసెయ్‌’ చిత్రం కూడా తెరపైకి వస్తోంది. ఈ సినిమా ఆడియో విడుదల వేదికపై భాగ్యరాజ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక జల్లికట్టు కోసం యావత్‌ దేశమే ఆశ్చర్యపోయేలా తమిళ జాతి చేసిన ఆందోళన నేపథ్యంలో తెరకెక్కిన ‘మెరీనా పురట్చి’ పలుసార్లు వాయిదా పడిండి. చివరకు శుక్రవారం తెరపైకి వస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించలేదని సమాచారం. అయితే గురువారం సాయంత్రం వరకు వాయిదాకు సంబంధించి ప్రకటన ఏమీ చేయలేదు. అదేవిధంగా ‘తిరుపతిస్వామి కుడుంబం’, ‘మంగుని పాండియన్‌’ చిత్రాలు తెరపై వాలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలా మొత్తం 12 సినిమాలు రెడీ ఫర్‌ రిలీజ్‌కు ఉన్నాయని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో తొమ్మిది కన్నా తక్కువ సినిమాలు తెరపైకి వస్తాయని విశ్వసనీయ సమాచారం.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.