‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ లోగో వచ్చేసింది
close
Published : 25/03/2020 12:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టైటిల్‌ లోగో వచ్చేసింది

ఆకట్టుకుంటోన్న మోషన్‌ పోస్టర్‌

హైదరాబాద్‌: సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టైటిల్‌ లోగో వచ్చేసింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి RRR(రౌద్రం రణం రుధిరం)  అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం టైటిల్‌ లోగోతోపాటు మోషన్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

మొదటిసారి ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని