‘నాగవల్లి’ బాలయ్యతో అనుకున్నాం..!
close
Updated : 10/06/2020 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘నాగవల్లి’ బాలయ్యతో అనుకున్నాం..!

బాలయ్య బంగారం: పరుచూరి గోపాలకృష్ణ

హైదరాబాద్‌: వెంకటేశ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘నాగవల్లి’ చిత్రాన్ని మొదట బాలకృష్ణతో చేయాలనుకున్నామని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పరుచూరి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. బాలయ్యతో ఎన్నో చిత్రాలు తెరకెక్కించాలని భావించినప్పటికీ పలు కారణాల వల్ల అవి పట్టాలెక్కలేదన్నారు.

‘‘అనురాగదేవత’ సినిమా కోసం 1980 జూన్‌లో మొదటిసారి బాలకృష్ణను కలిశాం. 40 ఏళ్లగా నందమూరి బాలకృష్ణతో మాకెంతో అనుబంధం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే బాలయ్య బంగారం. ఆయనది పాల మనసు. బాలయ్య కథానాయకుడిగా ‘హరహర మహాదేవ’ సినిమా అనుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు అనుకున్నాం కానీ పలు కారణాల వల్ల అవి ఆగిపోయాయి. సినిమాల విషయంలో గ్యాప్‌ వచ్చింది కానీ అనుబంధంలో మేము ఎప్పుడూ కలిసే ఉన్నాం. వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘నాగవల్లి’ చిత్రాన్ని మొదట బాలయ్యతో అనుకున్నాం. కానీ ఆయనకు స్ర్కిప్ట్‌ నచ్చలేదు. అలా మేము వెంకటేశ్‌తో ఆ సినిమా చేశాం. అలాగే ‘అన్నవరం’, ‘సింహరాశి’ సినిమాలు కూడా బాలయ్యకే అనుకున్నాం.’ అని పరుచూరి తెలిపారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని