నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: ఖుష్బూ
close
Updated : 17/06/2020 16:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: ఖుష్బూ

అలాంటి సమయంలో..

చెన్నై: ఒకప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడ్డానని ప్రముఖ నటి ఖుష్బూ తెలిపారు. బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె ట్విటర్‌లో స్పందించారు. ఇలాంటి పరిస్థితులు, సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయని, వాటిని అధిగమించాలని సందేశం ఇచ్చారు. ‘ప్రతి మనిషి బాధ, ఒత్తిడిని ఎదుర్కొంటాడు. నాకు అలాంటి సమస్యలు లేవని చెబితే.. అది అబద్ధం అవుతుంది. నేనూ మానసిక ఒత్తిడికి గురయ్యా. నా జీవితాన్ని ముగించాలి అనుకున్నా (ఆత్మహత్య). కానీ ఓ సందర్భంలో వాటితో పోరాడాలనే కసి ఏర్పడింది. నన్ను ఓడించి, నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న ఆ సమస్యల కంటే నేను దృఢమని నిరూపించాలనుకున్నా. నా ముగింపు కోసం ఎదురుచూస్తున్న వారిని ఓడించాలని నిర్ణయించుకున్నా’.

‘ఒకానొక దశలో నా జీవితం నిలిచిపోయింది. ఎటు పాలుపోలేని పరిస్థితిలో నిలబడిపోయా. భయానకంగా అనిపించింది. ఈ సమస్యల్ని భరించడం కంటే శాశ్వత నిద్రలోకి వెళ్లడం సులభమైన మార్గం అనుకున్నా. కానీ నాలోని ధైర్యం నన్ను వెనక్కి లాగింది. స్నేహితులు నా దేవదూతల్లా మారారు. నన్ను మానసికంగా కుంగుబాటుకు గురి చేసి భయపెడుతున్న విషయాల కోసం విలువైన జీవితాన్ని ఎందుకు వదులుకోవాలి అనుకున్నా. నా జీవితంలో ఓ కాంతి రేఖ కోసం.. ఓ ఆశ కోసం.. ఓ అవకాశం కోసం ఎదురుచూశా. బాధల్ని వెనక్కి నెట్టి.. ఈ రోజు ఇలా ఉన్నా’.

‘పరాజయాలు చూసి నేను భయపడలేదు. చీకటి చూసి బెదరలేదు. నాకే తెలియకుండా నన్ను ముందుకు నెడుతున్న వాటిని చూసి జంకలేదు. పోరాడే శక్తి ఉంది కాబట్టే ఇంత దూరం రాగలిగాను. ధైర్యంగా ముందడుగు వేసి.. పరాజయాల్ని విజయాలుగా మార్చుకోవడం నేర్చుకున్నా’ అని ఖుష్బూ తన కథ వివరించారు. ఫాలోవర్స్‌లో స్ఫూర్తి నింపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని