ఎన్టీఆర్‌ను సపోర్ట్‌ చేసినందుకు బెదిరిస్తున్నారు
close
Published : 30/06/2020 00:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ను సపోర్ట్‌ చేసినందుకు బెదిరిస్తున్నారు

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌కు మద్దతుగా మాట్లాడినందుకు తనని బెదిరిస్తున్నారని నటి పాయల్‌ ఘోష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను డైరెక్ట్‌ మెస్సేజ్‌ ఆప్షన్‌ తొలగించినట్లు తెలిపారు. ఇటీవల తాను బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం గురించి మాట్లాడితే, తారక్‌ కూడా సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారని తనకు సందేశాలు పంపుతున్నట్లు వాపోయారు. అయితే, సినిమా కోసం ఆయన పడే కష్టం ఎవరికీ తెలియదని చెప్పుకొచ్చారు.

‘‘నన్ను బెదిరించడం కొంతమందికి ఒక క్రేజ్‌లా ఉంది.  నేను తారక్‌కు మద్దతుగా నిలబడటం వెనుక అసలు కారణం మీరెప్పటికీ అర్థం చేసుకోలేరు. ఆయన పట్ల కాస్త జాలి చూపండి. ఆయన గతం గురించి తెలిసి నాకు కన్నీళ్లు ఆగలేదు. ఏడ్చేశాను. ఇక చాలు ఆపండి. ఎన్టీఆర్‌ను చూసి గర్వపడండి’’ అంటూ పాయల్‌ ట్వీట్‌ చేశారు.

తాను ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్నానన్న పాయల్‌.. దయ చేసి సామాజిక మాధ్యమాల వేదికగా తనని దూషించడం ఆపాలని కోరారు. తెలుగులో ‘ప్రయాణం’, ‘ఊసరవెల్లి’ తదితర చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో కొనసాగుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని