close
Published : 24/02/2021 02:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రవితేజకి జోడీగా..

‘క్రాక్‌’తో విజయాన్ని అందుకున్న కథానాయకుడు రవితేజ జోరుమీదున్నారు. ప్రస్తుతం ‘ఖిలాడి’లో నటిస్తున్న ఆయన తదుపరి చిత్రానికీ రంగం సిద్ధమైంది. అది రవితేజ 68వ చిత్రంగా, త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనుంది. అందులో రవితేజకి జోడీగా ఇద్దరు భామలు ఆడిపాడనున్నారు. ఐశ్వర్య మేనన్‌ ఓ కథానాయికగా  ఎంపికైనట్టు సమాచారం. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాలో మరో కథానాయికగా కన్నడ భామ ఒకరు నటించనున్నట్టు తెలిసింది. టి.జి.విశ్వ   ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని