close
Published : 13/04/2021 02:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాన్‌ ఇండియా చిత్రంతో...

న్టీఆర్‌ 30వ చిత్రం విడుదల తేదీతో సహా ఖరారైంది. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కనున్న చిత్రమిదే. ఆ మేరకు సినీ వర్గాలు సోమవారం అధికారిక ప్రకటనని విడుదల చేశాయి. కొరటాల శివ దర్శకత్వంలో, పాన్‌ ఇండియా స్థాయి కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. జూన్‌ ద్వితీయార్థంలో సినిమాని పట్టాలెక్కిస్తారు. ఏప్రిల్‌ 29, 2022న పలు భారతీయ భాషల్లో విడుదల చేస్తారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పకులు. మిక్కిలినేని సుధాకర్‌, కొసరాజు హరికృష్ణ నిర్మాణానికి నేతృత్వం వహిస్తారు. ‘‘తారక్‌తో మరోసారి కలిసి సినిమా చేస్తుండడం సంతోషంగా ఉంది. గతంలో రిపేర్లు లోకల్‌గానే చేశా. ఈసారి కొంచెం మార్పుతో సరిహద్దులుదాటబోతున్నాం’’ అని కొరటాల శివ ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని