చిత్రీకరణకు సిద్ధం
close
Published : 12/06/2021 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిత్రీకరణకు సిద్ధం

హేష్‌బాబు కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14రీల్స్‌ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్‌ కథానాయిక. ఇప్పటికే దుబాయ్‌లో ఓ కీలక షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల తాత్కాలికంగా ఆగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులన్నీ క్రమంగా కుదుట పడుతుండటంతో.. చిత్ర బృందం కొత్త షెడ్యూల్‌ ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకు మహేష్‌ నుంచి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ అందినట్లు సమాచారం. తెలంగాణలో వచ్చే వారం నుంచి లాక్‌డౌన్‌ ఎత్తివేసినట్లయితే.. ఈనెలాఖరు నుంచే చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. లేదంటే జులై తొలి వారంలో షూట్‌ పునఃప్రారంభమవుతుందని సమాచారం. ఇక ఈ సినిమా అప్‌డేట్ల విషయమై.. చిత్ర బృందం శుక్రవారం సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘చిత్రీకరణ తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి ‘సర్కారు వారి పాట’ అప్‌డేట్స్‌ పంచుకుంటామ’’ని ఆ ప్రకటనలో పేర్కొంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని