ప్రభాస్‌... ‘ప్రాజెక్ట్‌ కె’
close
Published : 25/07/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌... ‘ప్రాజెక్ట్‌ కె’

కేసారి నాలుగు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు అగ్ర కథా నాయకుడు ప్రభాస్‌. ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. నాలుగో చిత్రం శనివారం రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైంది. ‘ప్రాజెక్ట్‌ కె’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో మొదలైన ఈ సినిమాకి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఘన విజయం సాధించిన ‘మహానటి’ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమిదే. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ సరసన దీపికా పదుకొణె నాయికగా నటిస్తోంది.అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఆయనపైనే ముహూర్తపు సన్నివేశాన్ని తెరకెక్కించగా, ప్రభాస్‌ క్లాప్‌నిచ్చారు. ‘‘గురు పౌర్ణమి రోజున భారతీయ సినిమా గురు అమితాబ్‌పై క్లాప్‌ కొట్టడం గౌరవంగా భావిస్తున్నా’’ అని ప్రభాస్‌ ట్వీట్‌ చేశారు. ‘‘మనదేశంలోనే కాదు... ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా సినీ మాయాజాలపు అలల్ని విస్తరింపజేసిన ఐకాన్‌ ప్రభాస్‌. ఆయన ‘ప్రాజెక్ట్‌ కె’ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నా’’ అని అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాం. భారతీయ సినిమాల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్న సినిమా సెట్‌ ఇదే అవుతుంది. ప్రేక్షకులు మునుపెన్నడూ ఆస్వాదించని ఓ గొప్ప అనుభూతిని ఈ చిత్రం ప్రేక్షకులకు పంచుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని