సాయి పల్లవి సర్‌ప్రైజ్‌ చేస్తుందా?
close
Published : 11/01/2020 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాయి పల్లవి సర్‌ప్రైజ్‌ చేస్తుందా?

హైదరాబాద్‌: ఈ సంక్రాంతి పండగకు కథానాయిక సాయిపల్లవి అభిమానులకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారట. దర్శకుడు శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘వెంకీమామ’ తర్వాత నాగచైతన్య ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో చైతన్య ఫస్ట్‌లుక్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఆయన ఓ మధ్య తరగతి యువకుడి పాత్రలో కనిపించి, ఆకట్టుకున్నారు. ఇప్పుడు సాయిపల్లవి లుక్‌ను సంక్రాంతి రోజున విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

శేఖర్‌ కమ్ముల, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రం ఇది కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ‘ఫిదా’లో భానుమతిగా అలరించిన పల్లవి ఈ చిత్రంలో ఏ పాత్రతో ఆకట్టుకోబోతున్నారో చూడాలి. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని