ప్రభాస్‌కు విలన్‌ ఆయనేనా?
close
Published : 15/02/2020 20:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌కు విలన్‌ ఆయనేనా?

హైదరాబాద్‌: ‘సాహో’ తర్వాత ప్రభాస్‌ కథానాయకుడిగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. ప్రభాస్‌ 20వ చిత్రంగా ఇది రూపొందుతోంది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన సెట్స్‌లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. గోపీకృష్ణ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా  జగపతిబాబు నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

తొలుత ఈ చిత్రానికి ‘జాన్‌’ అనే పేరు పరిశీలించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పేరు మారనుందని తెలుస్తోంది. ఆ స్థానంలో ‘ఓ డియర్‌’ అనే పేరు పెట్టాలన్న ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. ‘రాధే శ్యామ్‌’ అనే మరో పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. అలనాటి బాలీవుడ్‌ అందాల తార భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని