‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ వచ్చేది అప్పుడేనా?
close
Updated : 31/03/2020 12:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్‌ వచ్చేది అప్పుడేనా?

హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూసిన మెగా అభిమానులకు రామ్‌చరణ్‌ పుట్టిన రోజున మంచి గిఫ్ట్‌ లభించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి అల్లూరి సీతారామరాజుగా కనిపించి చెర్రీ కనువిందు చేశారు. ఇప్పుడు మెగా అభిమానులు మరో ట్రీట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా ప్రస్తుతం తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే, అనుకోకుండా టైటిల్‌ రివీల్‌ చేసి అందరికీ ఆశ్చర్య పరిచారు చిరంజీవి. ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. అయితే, ఉగాది పచ్చడిలో చేదులా వారికి నిరాశే మిగిలింది. 

తాజాగా ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. శ్రీరామనవమి సందర్భంగా ‘ఆచార్య’ నుంచి చిరంజీవి ఫస్ట్‌లుక్‌ విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. ఏప్రిల్‌ 2న ‘ఆచార్య’ను చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చిత్ర బృందం ఎవరి ఇంట్లో వాళ్లు ఫస్ట్‌లుక్‌ కోసం శ్రమిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే చిరు ట్విటర్‌ ఖాతా తెరిచారు. తొలిరోజు నుంచే ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా చురుగ్గా పాల్గొంటున్నారు. కరోనాపై పోరాటానికి సినీ పరిశ్రమ నుంచి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనే స్వయంగా తన ఫస్ట్‌లుక్‌ను పంచుకుంటారని టాక్‌. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

‘ఆచార్య’ నుంచి కథానాయికగా త్రిష తప్పుకోవడంతో ఆ స్థానంలో కాజల్‌ వచ్చి చేరారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తారని సమాచారం. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని