‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్‌ వచ్చేసింది!
close
Updated : 05/01/2020 21:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర మెగా సూపర్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను చిరంజీవి విడుదల చేశారు. టీజర్‌తో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరగ్గా,  ట్రైలర్‌ మరింత ఆసక్తిని పెంచింది. మహేశ్‌ నటన, కామెడీ టైమింగ్‌ మరో రేంజ్‌లో ఉన్నట్లు ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. ‘చిన్న బ్రేక్‌ ఇస్తున్నా.. తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది’ అంటూ చివర్లో మహేశ్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని