‘జాను’ టీజర్‌ వచ్చేసింది..!
close
Published : 09/01/2020 17:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జాను’ టీజర్‌ వచ్చేసింది..!

హైదరాబాద్‌: సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘జాను’ టీజర్‌ వచ్చేసింది. తమిళంలో మంచి విజయం సాధించిన ‘96’ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత, శర్వానంద్‌ కీలక పాత్రలు పోషించారు. మాతృకను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. టీజర్‌లో జానకిగా సమంత, రామ్‌గా శర్వానంద్‌ నటన ఆకట్టుకుంటోంది. ‘చాలా దూరం వెళ్లిపోయావా రామ్‌..’ అని భావోద్వేగానికి లోనైన సమంత.. శర్వానంద్‌ను అడగగా.. ‘నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే ఉన్నాను’ అని చెప్పే డైలాగులతో టీజర్‌ ఉంది. టీజర్‌లో ఉన్న సన్నివేశాలు, నేపథ్య సంగీతం ప్రేక్షకులను హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి.

త్రిష, విజయ్‌ సేతుపతి కీలకపాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘96’. 2018లో విడుదలైన ఈ ప్రేమకావ్యానికి ఎందరో సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. స్కూల్‌ డేస్‌లో చదువుకుంటున్నప్పుడు త్రిష, విజయ్‌ సేతుపతి ప్రేమించుకుంటారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరు విడిపోతారు. అలా విడిపోయిన వీరిద్దరు కొన్ని సంవత్సరాల తర్వాత స్కూల్‌ రీయూనియన్‌లో కలుస్తారు. ఆ సమయంలో వీరిద్దరు మధ్య జరిగిన సంఘటనలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేమకు కొత్త నిర్వచనాన్ని తెలిపింది.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని