నాకు పిచ్చి పట్టిందేమో అనుకున్నారు: దిల్‌రాజు
close
Published : 30/01/2020 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాకు పిచ్చి పట్టిందేమో అనుకున్నారు: దిల్‌రాజు

మిళంలో విజయం సాధించిన ‘96’ను తెలుగులో ‘జాను’గా రీమేక్‌ చేశారు. శర్వానంద్‌, సమంత జంటగా నటించారు. ప్రేమ్‌కుమార్‌ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. ఫిబ్రవరి 7న వస్తోంది. హైదరాబాద్‌లో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘పదహారేళ్ల నా సినీ జీవితంలో ఇదే నా తొలి రీమేక్‌. ‘96’ రీమేక్‌ చేస్తున్నానని తెలియగానే ‘దిల్‌రాజుకేమైనా పిచ్చా? క్లాసిక్‌ని పాడు చేస్తున్నాడు’ అనుకున్నారంతా. కానీ తమిళ సినిమా చూస్తున్నప్పుడు నేను ఏ అనుభూతికి గురయ్యానో.. ‘జాను’ను చూసినప్పుడు ప్రేక్షకులు కూడా అదే అనుభూతిని ఆస్వాదిస్తారన్న నమ్మకం ఉంద’’న్నారు. సమంత మాట్లాడుతూ ‘‘96’లో త్రిష చేసిన పాత్రకి న్యాయం చేయడం కష్టం. కానీ దిల్‌రాజుగారిని కలిసిన మరు నిమిషంలోనే ‘ఈ సినిమా చేస్తా’ అని మాటిచ్చేశా’’ అన్నారు. ‘‘శతమానం భవతి’ సమయంలో ‘ఈ సినిమాతో హిట్‌ కొడతాం’ అన్నారు దిల్‌రాజు. అనుకున్నట్టే నా కెరీర్‌లోనే పెద్ద విజయాన్ని అందించారు. ‘96’ రీమేక్‌ సమయంలోనూ అలాగే చెప్పారు. తప్పకుండా మంచి సినిమా అవుతుంద’’న్నారు శర్వానంద్‌.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని