అందుకే ‘ఇప్పుడే మొదలైంది...’ అన్నారట
close
Published : 14/05/2020 20:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ‘ఇప్పుడే మొదలైంది...’ అన్నారట

‘‘పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాని గుండెల్లో పెట్టుకున్నారు. ఎప్పటికీ మరిచిపోలేని చిత్రమని ఏటా నిరూపిస్తున్నారు. మళ్లీ పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేస్తుండడం ఆనందంగా ఉంది. కథ దాదాపుగా పూర్తయింది’’ అన్నారు దర్శకుడు హరీష్‌  శంకర్‌. పవన్‌కల్యాణ్‌ 28వ చిత్రాన్ని హరీష్‌ తెరకెక్కించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నటించనున్న కథానాయిక ఎంపిక గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని హరీష్‌శంకర్‌ ‘ఈనాడు సినిమా’తో చెప్పారు.

‘‘లాక్‌డౌన్‌ వల్ల షెడ్యూల్స్‌ అన్నీ వాయిదా పడ్డాయి కాబట్టి ఇప్పుడు ఈ సినిమా గురించి ఏం చెప్పినా తొందరే అవుతుంది. ప్రస్తుతం స్క్రిప్టు పనుల్లో ఉన్నా. సంగీత చర్చలు కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. ‘ఇప్పుడే మొదలైంది...’ అనే మాటకీ, ఈ సినిమా పేరుకీ ఎటువంటి సంబంధం లేదని చెప్పారు హరీష్‌శంకర్‌. ‘‘గబ్బర్‌ సింగ్‌’లో ఇంటర్వెల్‌ ముందు ‘అప్పుడే అయిపోయిందనుకోకు... ఇప్పుడే మొదలైంది...’ అని విలన్‌ని ఉద్దేశించి పవన్‌ సంభాషణ చెబుతారు. నేను, దేవిశ్రీప్రసాద్‌.. ఇలా మా బృందమంతా మళ్లీ పవన్‌ సినిమాతో ప్రయాణం మొదలెట్టాం. అందుకే ‘ఇప్పుడే మొదలైంది...’ అని ట్వీట్‌ చేశాన’’ని చెప్పారు హరీష్‌. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని