అత్యంత ప్రమాదకర విమానాశ్రయంలో చిత్రీకరణ
close
Updated : 10/10/2021 04:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అత్యంత ప్రమాదకర విమానాశ్రయంలో చిత్రీకరణ

‘మైనే ప్యార్‌ కియా’, ‘హమ్‌ ఆప్కే హై కౌన్‌’, ‘వివాహ్‌’, ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’ లాంటి ప్రేమ కథ నిండిన కుటుంబ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన దర్శకనిర్మాత సూరజ్‌ బర్జాత్య. ఇప్పుడు ఆయన స్నేహం నేపథ్యంలో ఓ కొత్త చిత్రాన్ని తీసుకురాబోతున్నారు. అదే ‘ఊంచాయి’. ఇందులో ప్రముఖ నటులు అమితాబ్‌బచ్చన్‌, అనుపమ్‌ ఖేర్‌, బొమన్‌ ఇరానీ, పరిణీతి చోప్రా, నీనా గుప్తా, సారిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. ‘‘ఈ చిత్రంలో నేపాలీ టూరిస్ట్‌ గైడ్‌గా పరిణీతి కనిపించనుంది. ఇటీవలే నేపాల్‌లో తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలైంది. ఎవరెస్ట్‌ బేస్‌కు దగ్గర్లో ఉండే లుక్లా ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారట. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఎయిర్‌పోర్ట్‌గా లుక్లాకు పేరుంది. త్వరలోనే నమ్చేలో కొన్ని సన్నివేశాలను తీయనున్నారు. సముద్రమట్టానికి 13,000 అడుగుల ఎత్తులో ఉండే ప్రాంతం ఇది. దీంతో పాటు సముద్రమట్టానికి 26,000 అడుగుల ఎత్తులో ఉండే పర్వతశ్రేణుల్లోనూ చిత్రీకరణ చేయనున్నారు’’అని చిత్ర వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించే నలుగురు కీలకమైన నటులు 60 ఏళ్లు దాటినవారే. చలి విపరీతంగా ఉండటంతో చాలా సవాళ్లు మధ్య చిత్రీకరణ చేయాల్సి ఉంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని