కేసీఆర్‌ సహాయం చేస్తానన్నారు: చిరంజీవి
close
Updated : 02/01/2020 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేసీఆర్‌ సహాయం చేస్తానన్నారు: చిరంజీవి

మా ‘డైరీ’ ఆవిష్కరణలో మెగాస్టార్‌

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారని టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) డైరీని టాలీవుడ్ అగ్రకథానాయకులు చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్‌బాబు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ‘మా’ సభ్యులతోపాటు ఇతర నటీనటులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ..‘సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని వివరాలను ఈ డైరీలో పొందుపరిచాం. ఈ ఏడాది రెండు, మూడు ఈవెంట్లు చేయాలి. నాగార్జున, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌, ప్రభాస్‌లతోపాటు ఇతర యువ కథానాయకులతో మాట్లాడతాను. వాళ్లు కూడా నేను అడిగితే ఈవెంట్లు కోసం ఒప్పుకుంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ గారు కూడా చిత్రపరిశ్రమకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి ఎటువంటి సహాయసహకారాలు కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆరే స్వయంగా చెప్పారు. కాబట్టి చిత్రపరిశ్రమకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో మనం చర్చించుకుందాం. ఆయనకు చెబుదాం.’ అని చిరంజీవి అన్నారు.

ఇవీ చదవండి..!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని