ఏడున ఐదు: సినీ ప్రియులకు పండగే..!
close
Updated : 06/02/2020 15:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏడున ఐదు: సినీ ప్రియులకు పండగే..!

ఒకే రోజు థియేటర్‌లో ఐదు సినిమాలు

హైదరాబాద్‌: కొత్త సంవత్సరం.. కొత్త నెల.. అగ్రహీరోలకు చెందిన చిత్రాలతోపాటు ఇటు చిన్న సినిమాలతో వెండితెర కళకళలాడిన విషయం తెలిసిందే. జనవరి నెలలో విడుదలైన చిత్రాల్లో దాదాపు అన్నీ మంచి వసూళ్లను రాబట్టి.. బాక్సాఫీస్‌ వద్ద విజయాలను నమోదు చేసుకున్నాయి. అది మరవక ముందే బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు ప్రేమకథా చిత్రాలు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి అంటే అటు ప్రేమికులతోపాటు ఇటు సినీ ప్రియులకు కూడా పండగ నెల అనే చెప్పాలి. ఎందుకంటే ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్నో ప్రేమకథలు ప్రేక్షకులను అలరిస్తాయి. అలా ఫిబ్రవరి మొదటివారంలో అనగా 7తేదీన వెండితెరపై ఐదు చిత్రాలు సందడి చేయబోతున్నాయి. వాటిలో కొన్ని పూర్తి ప్రేమకథలు, మరి కొన్ని కామెడీ, యాక్షన్‌ చిత్రాలు.

‘జాను’ మెప్పిస్తుందా..

సమంత, శర్వానంద్‌ నటించిన చిత్రం ‘జాను’. తమిళంలో మంచి విజయం సాధించిన ‘96’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మాతృకను తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్‌ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌, పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ‘జాను’ ఎంతవరకూ హృదయాలను తాకుతుందో తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాలి.

‘త్రి మంకీస్‌’ నవ్విస్తారా..

బుల్లితెరలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’ కామెడీ షోతో ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు సుడిగాలి సుధీర్‌, శ్రీను, రాంప్రసాద్‌. తాజాగా వీరు ముగ్గురూ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘త్రి మంకీస్‌’. ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటికే ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ సినిమాతో మిశ్రమ స్పందనలు అందుకున్న సుధీర్‌ ఈ సినిమాతో సక్సెస్‌ను సొంతం చేసుకుంటాడా?.. అలాగే ‘త్రి మంకీస్‌’ సినిమాతో సుధీర్‌, శ్రీను, రాంప్రసాద్‌ ప్రేక్షకులను మెప్పిస్తారా తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

‘సవారీ’ ఎలా ఉండనుందో..

కథ నచ్చితే చాలు చిన్న సినిమా అయినా ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. టాలీవుడ్‌లో వచ్చిన ఎన్నో చిన్న సినిమాలు దానికి నిదర్శనం. తాజాగా నందు కథానాయకుడిగా తెరకెక్కిన చిన్న సినిమా ‘సవారీ’. ప్రియాంక శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సాహిత్‌ మోతికూరి దర్శకత్వం వహించారు. పోస్టర్లు, ట్రైలర్‌ను బట్టి చూస్తుంటే ఈ సినిమా కథ చాలా వినూత్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘ఉండిపోవా నువ్విలా’ అనే పాట కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. మరి ఈ ‘సవారీ’ ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకోనుందో చూడాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

బాలీవుడ్‌ నుంచి ‘మలంగ్‌’..

యాక్షన్‌+ప్రేమ ప్రధానాంశంగా తెరకెక్కిన బాలీవుడ్‌ చిత్రం ‘మలంగ్‌’. బాలీవుడ్‌ కథానాయకుడు ఆదిత్యరాయ్‌ కపూర్‌, దిశాపటానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అనిల్‌ కపూర్‌ కీలకపాత్రను పోషించారు. మోహిత్‌ సూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో కూడా నిలిచింది. మరి ‘ఆషికీ 2’ లాంటి ప్రేమకథతో మెప్పించిన ఆదిత్య రాయ్‌కపూర్‌.. ‘మలంగ్‌’తో ఎంతవరకూ అలరిస్తాడో తెలియాలంటే రేపు థియేటర్లకు వెళ్లాల్సిందే.

‘స్టాలిన్‌’ ఆకర్షిస్తాడా..

‘రంగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు తమిళ నటుడు జీవా. ఆ తర్వాత ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్బింగ్‌ అయినప్పటికీ ఆ సినిమాలు  అంతగా మెప్పించలేదు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘స్టాలిన్‌’. జీవాకు జంటగా రియా నటించారు. ఈసినిమాలో నవదీప్‌ విలన్‌గా కనిపించనున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకూ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందో తెలియాలంటే రేపటి వరకూ వేచి చూద్దాం..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని