అలియాతో షూటింగ్‌ రద్దయింది: రాజమౌళి
close
Published : 11/04/2020 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అలియాతో షూటింగ్‌ రద్దయింది: రాజమౌళి

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వల్ల అలియా భట్‌తో షూటింగ్‌ షెడ్యూల్‌ రద్దు అయ్యిందని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెలిపారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. అలియాభట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో దానయ్య నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో అలియా పాల్గొనడం గురించి తాజాగా జక్కన్న ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడారు. ‘ఈ నెలలో అలియాతో షూటింగ్‌ జరగాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ వల్ల అది రద్దయింది. దీంతో డేట్స్‌, షెడ్యూల్స్‌ను మార్చాల్సి వచ్చింది. అలియాతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’ అన్నారు.

అనంతరం అలియాను సినిమాలోని పాత్రకు ఎంపిక చేయడం గురించి మాట్లాడుతూ.. ‘తారక్, చరణ్‌ల మధ్య నిలబడగల ఓ నటి కావాలి అనుకున్నా. వీరిద్దరూ చాలా ప్రతిభావంతులైన కథానాయకులు. నటి అమాయకంగా ఉండాలి, అదేవిధంగా ధైర్యం కూడా చూపించాలి. ఈ లక్షణాలు అలియాలో ఉండటం వల్ల ఆమెను సినిమాకు తీసుకున్నా’ అని చెప్పారు.

ఇటీవల చరణ్‌, తారక్‌.. ఇద్దరి పాత్రల కోసం అలియాను తీసుకున్నారని వార్తలు వచ్చాయి. వీటి గురించి రాజమౌళిని ప్రశ్నించగా.. ‘ఇది ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ కాదు. ఇద్దరితోనూ ఆమె కనిపించదు’ అని పేర్కొన్నారు. ‘ఓ భారీ సినిమాలో ఆర్ట్‌ను, కామర్స్‌ను బ్యాలెన్స్‌ చేయడం చాలా ముఖ్యం. ఒకదాన్ని మరొకదాని కోసం త్యాగం చేయకూడదు. అన్నీ సమానంగా ఉండాలి. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లోని స్టార్స్‌ ఇమేజ్‌ సినిమాకు మరింత బలం అవుతుందని ఆశిస్తున్నా’ అని ఆయన చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని