మహేశ్‌ తల్లిగా అయినా ఓకే: రేణూ దేశాయ్‌
close
Published : 03/05/2020 13:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ తల్లిగా అయినా ఓకే: రేణూ దేశాయ్‌

హైదరాబాద్‌: నటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌ మళ్లీ నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతులపై చిత్రం తీయబోతున్నట్లు ఇటీవల ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గ్రామాలకు వెళ్లి అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు. కాగా తాజా ఇంటర్వ్యూలో రేణూ నటిగా రీ ఎంట్రీ గురించి ముచ్చటించారు. తల్లి పాత్రలు పోషిస్తారా?అని ప్రశ్నించగా.. పాత్ర బాగుంటే.. మహేశ్‌బాబు, ప్రభాస్‌కు తల్లి పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు (నవ్వుతూ).  మంచి అవకాశం వస్తే.. హీరో చిన్నతం, ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల్లో తల్లిగా చేస్తానని అన్నారు. మేకప్‌తో వృద్ధురాలి గెటప్‌ వేసుకుని ఆ పాత్రలు చేయడానికి కూడా అభ్యంతరం లేదని ఆమె పేర్కొన్నారు. ‘చివరికి మేమంతా నటీనటులం అంతే..’ అని ఆమె చెప్పారు. రేణూ రీ ఎంట్రీపై ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తన ప్రాజెక్టు విషయమై రేణూ ఇటీవల ఓ గ్రామానికి వెళ్లి.. అక్కడి ప్రజలతో సమయం గడిపారు. ‘ప్రీ ప్రొడక్షన్‌ ఫుటేజీ.. మన రైతుల కథలను మీ ముందుకు తీసుకురావాలని ఆతృతగా ఉన్నా. ఈ వీడియోలో ఉన్న చిన్నారులను వారు తీసుకునే ఆహారం గురించి అడిగా. తానెంతో బలంగా ఉన్నానని ఓ బాబు చెప్పాడు. అందుకే అతడి చేయి పట్టుకుని.. ఆటపట్టించా. ఈ సినిమా నా మనసుకు ఎంతో దగ్గరైంది’ అంటూ ఆమె శనివారం ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని