భిక్షాటన చేస్తా.. ప్రకాశ్‌రాజ్ ‌ట్వీట్‌
close
Published : 16/05/2020 20:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భిక్షాటన చేస్తా.. ప్రకాశ్‌రాజ్ ‌ట్వీట్‌

లేదా అప్పు తీసుకుంటా...

హైదరాబాద్‌: వలస కార్మికులకు సాయం చేయడానికి భిక్షాటన చేస్తానని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. ఆయన లాక్‌డౌన్‌ సమయంలో ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా పేదలకు వివిధ రూపాల్లో సాయం చేస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయాలు, ఆహారం పంపిణీ చేస్తున్నారు. అంతేకాదు కొంతమంది నిరాశ్రయులకు తన ఫాంహౌస్‌లో ఆశ్రయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న సొమ్ము అయిపోతోందని ఇటీవల ఆయన ట్వీట్‌ చేశారు. ‘నా ఆర్థిక వనరులు క్షీణిస్తున్నాయి. అయినా సరే లోన్‌ తీసుకునైనా పేదలకు సాయం చేయడం కొనసాగిస్తా. కావాలంటే నేను మళ్లీ సంపాదించుకోగలను’ అని పేర్కొన్నారు.

కాగా తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్తున్న వలస కార్మికుల్ని ఆదుకోవడం గురించి తాజాగా ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌ చేశారు. ‘వలస కార్మికులు రోడ్లపై ఉన్నారు. నేను భిక్షాటన చేస్తా, లేదా అప్పు తీసుకుంటా. కానీ నా సహ పౌరులకు సాయం చేస్తా. వాళ్లు తిరిగి నాకు ఏమీ ఇవ్వరని తెలుసు. కానీ వారు ఇళ్లకు చేరుకున్న తర్వాత.. ‘ఓ వ్యక్తి తిరిగి ఇంటికి చేరుకుంటామనే ఆశను కల్పించాడు. మాకు శక్తిని ఇచ్చాడు’ అనుకుంటే చాలు’ అని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రకాశ్‌రాజ్‌ ఫౌండేషన్‌ కార్యకర్తలు వలస కార్మికులతో ఉన్న ఫొటోల్ని షేర్‌ చేశారు. రోజుకి దాదాపు 500 మంది వలస కార్మికులకు ప్రకాశ్‌రాజ్ ఆహారం పంపిణీ చేస్తున్నారట.‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని