అనుష్కశర్మ వర్క్‌కు అనసూయ ప్రశంస..!
close
Updated : 20/05/2020 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుష్కశర్మ వర్క్‌కు అనసూయ ప్రశంస..!

ఇదే నా ఫేవరెట్‌..!

హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ నిర్మాతగా వ్యవహరించిన ఓ సిరీస్‌ను బుల్లితెర యాంకర్‌ అనసూయ ప్రశంసించారు. అదే తన ఫేవరెట్‌ వెబ్‌సిరీస్‌ అని పేర్కొన్నారు. సొంత నిర్మాణ సంస్థ ‘క్లీన్‌ స్లేట్‌’ పతాకంపై అనుష్కశర్మ నిర్మించిన వెబ్‌సిరీస్‌ ‘పాతాళ్‌ లోక్‌’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సిరీస్‌ మే 15న విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ సిరీస్‌ను చూసిన అనసూయ ట్విటర్‌ వేదికగా ప్రశంసల జల్లు కురిపించింది.

‘‘పాతాళ్‌ లోక్‌’!! అద్భుతమైన సిరీస్‌!! ఇప్పటివరకూ నేను చూసిన వాటిల్లో ఇదే నా ఫేవరెట్‌ సిరీస్‌. నటన, మేకింగ్‌.. ఒక్కమాటలో చెప్పాలంటే సూపర్‌. సిరీస్‌ పూర్తయిన  విధానం నాకెంతో నచ్చింది. చేని చెప్పిన సమాధానం, దానికి అనుగుణంగా సంజీవ్‌ మెహ్రా ఫేక్‌నెస్‌, త్యాగి అలర్ట్‌నెస్‌... అద్భుతంగా అనిపించింది. హథీరామ్‌ నా ఫేవరెట్‌!! ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సిరీస్‌ అని నేను భావిస్తున్నా.’ అని అనసూయ ట్వీట్‌ చేశారు.

లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన అనసూయ.. తన కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. తరచూ తన కుటుంబసభ్యుల కోసం రకరకాలైన వంటకాలు తయారుచేస్తున్నారు. ఇటీవల అభిమానుల కోరిక మేరకు ఆమె పలు కుకింగ్‌ వీడియోలను రూపొందించి ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని