కరోనా నివారణలో అలసత్వం: పవన్‌
close
Published : 04/05/2020 19:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నివారణలో అలసత్వం: పవన్‌

అమరావతి: కరోనా వైరస్‌తో ప్రపంచమంతా వణికిపోతుంటే ఇదొక సాధారణ జ్వరం లాంటిదేనని ప్రభుత్వం అనుకోవడం వల్లే నివారణ చర్యల్లో అలసత్వం నెలకొందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనంతపురం జిల్లా జనసేన నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, వైరస్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నేతలతో చర్చించారు.

‘‘కరోనా వ్యాప్తి తీరు, లాక్‌డౌన్‌ సడలింపులపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించాను. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాతే అసలు సవాళ్లు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని వైద్యారోగ్య శాఖ పటిష్ఠంగా లేకపోతే ఎదురయ్యే పరిణామాలు కరోనా ద్వారా బయటపడుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్‌ జోన్‌ ప్రాంతాలు రెడ్ జోన్లు కాకుండా చూసుకోవడమే అసలైన సవాల్. ఈ విషయంలో ప్రభుత్వ పాలనా యంత్రాంగం అప్రమత్తంగా, సమర్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది సాధారణ జ్వరం లాంటిదేనని మాట్లాడటం వల్ల నిర్లిప్తత వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో పని చేయాలని తపించే అధికారులు నిస్సహాయులయ్యారు. కేరళ లాంటి రాష్ట్రాలు ముందు నుంచీ ప్రజారోగ్యం పట్ల పకడ్బందీ చర్యలు తీసుకోవడంతోనే కరోనా విషయంలో సమర్థంగా వ్యవహరించ గలిగాయి’’ అని పవన్‌ వివరించారు.

‘‘అనంతపురం జిల్లాలో రైతులు కరవుతో నష్టపోయేవారు. ఈసారి వారిని కరోనా నష్టపరిచింది. ఉద్యాన పంటలు వేసిన వారు తీవ్ర ఇక్కట్లలో ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. కరవు ప్రభావిత జిల్లా అయిన అనంతపురానికి రావాల్సిన ప్రత్యేక నిధులు, ఇతర సాయాలపై, రైతులను ఆదుకొనే విధంగా చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చేలా స్పందిద్దాం. చేనేత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాల బాధలు నా దృష్టికి చేరాయి. ఇసుక విధానంతో, ఇప్పుడు కరోనాతో ఉపాధి కోల్పోయారు భవన నిర్మాణ కార్మికులు. కార్మికులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. కరోనా మూలంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు జనసేన నాయకులు, శ్రేణులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయం” అని పవన్‌ కొనియాడారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని