IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు
close
Published : 08/05/2020 19:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా నగరంలో చిక్కుకుపోయిన వలస కూలీలను ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. టోలీచౌకి నుంచి రైల్వే స్టేషన్‌కు లారీలో కిక్కిరిసి నిల్చుని వెళుతున్న కూలీలు.


ఓపీ విభాగంలో సేవలు అందించేందుకు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఓపీ విభాగాన్ని ప్రతి అరగంటకు ఓసారి శానిటైజ్‌ చేస్తున్నారు.


కర్నూలు నుంచి ఝార్ఖండ్‌లోని స్వస్థలాలకు శ్రామిక్‌ రైలులో వెళుతూ ఆనందంతో అధికారులకు వీడ్కోలు చెబుతున్న వలస కూలీలు.


దిల్లీలో వైన్‌ షాపు నుంచి ఈ-టోకెన్‌ విధానం ద్వారా మద్యం కొనుగోలు చేసిన అనంతరం మొబైల్‌ ఫోన్‌లో టోకెన్‌ను చూపుతున్న వ్యక్తి. ఈ-టోకెన్‌ విధానంతో మద్యం కోసం దుకాణం ఎదుట గంటలు తరబడి నిలబడకుండా టోకెన్‌లో పేర్కొన్న దుకాణం, సమయానికి వెళ్లి కొనుగోలు చేయవచ్చు.


ఖమ్మంలో సరి-బేసి విధానంలో తెరిచిన దుకాణాల్లో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలను పరిశీలిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌.


హైదరాబాద్‌: సేవల కోసం ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన వారిని చేతుల శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్‌ అందించి, థర్మల్‌ స్కాన్‌ చేసి కార్యాలయంలోనికి పంపిస్తున్న సిబ్బంది.


విశాఖ సమీపంలోని ఎల్జీ పాలిమర్స్‌ నుంచి స్టైరీన్‌ వాయువు లీకైన ఘటనతో భయపడి ఇళ్లు వదిలి ఫుట్‌పాత్‌పై కూర్చున్న ఆర్‌.ఆర్‌.వెంకటాపురం గ్రామస్థులు.


ముంబయిలోని టన్నెల్‌ రహదారి గుండా స్వస్థలం రాయ్‌ఘడ్‌ జిల్లాకు కాలినడకన బయలుదేరిన వలస కూలీలు. 


హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌ఘడ్‌లోని స్వస్థలానికి కాలినడకన బయలుదేరిన వలస కూలీ మార్గమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ తన అరిగిపోయిన చెప్పును చూస్తున్న దృశ్యం.


కేరళలోని కోళికోడ్‌ పుతియప్ప హార్బర్‌లో భౌతిక దూరం మరచి చేపలు కొనుగోలు చేస్తున్న ప్రజలు.


నెలన్నర తర్వాత లాక్‌డౌన్‌ ఆంక్షలను ప్రభుత్వం పాక్షికంగా సడలించడంతో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ చెరువు వద్ద ఓ కుటుంబం ఆటవిడుపు.


లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో ప్రజలు బయటకు రావడంతో హైదరాబాద్‌ మూసాపేట పైవంతన వద్ద ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌.


హైదరాబాద్‌: పేదలకు అన్నదానం చేసేందుకు దాతలు ఆటోలో తీసుకెళ్తున్న ఆహారం ఎస్సార్ నగర్‌లో రోడ్డుపై పడింది. వాహనదారులకు ఇబ్బంది లేకుండా దగ్గరుండి రోడ్డుపై పడిన అన్నాన్ని వారితోనే ఎత్తిస్తున్న పోలీసులు.


హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపు, పాస్‌ల జారీలో జాప్యంతో కోకాపేట నుంచి ఝార్ఖండ్‌లోని స్వస్థలాలకు వెళ్లేందుకు 24 మంది వలస కూలీలు బృందంగా బయలుదేరారు. గమ్యం చేరుకోవడానికి మార్గం చూపేందుకు స్మార్ట్‌ ఫోన్‌లో గూగుల్‌ మ్యాప్‌పై ఆధారపడ్డారు. వారిలో ఒకరి ఫోన్‌ ఆన్‌లో ఉంచి మిగతావి స్విచ్ఛాఫ్‌ చేశారు. బ్యాటరీ అయ్యిపోయాక మరొకరి ఫోన్‌ ఆన్‌ చేసి మ్యాప్‌ చూసేందుకు వీలుగా ఇలా చేస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని