పాక్‌ ఆర్మీ చీఫ్‌గా బజ్వా కొనసాగేనా?
close
Published : 07/01/2020 23:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ ఆర్మీ చీఫ్‌గా బజ్వా కొనసాగేనా?

మూడు కీలక బిల్లులకు పాక్‌ దిగువసభ ఆమోదం

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌గా జావేద్‌ బజ్వాను మరో మూడేళ్లు కొనసాగించేందుకు పాకిస్థాన్‌ దిగువ సభ సుముఖత వ్యక్తం చేసింది. అతని రీ అపాయింట్‌మెంట్‌కు అవసరమైన కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లును ఎగువసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమోదం పొందితే పాక్‌ చీఫ్‌ జనరల్‌గా జావేద్‌ బజ్వా మరో మూడేళ్లు కొనసాగుతారు.

నిజానికి మూడేళ్ల అదనపు సర్వీసు అనంతరం గత నవంబర్‌ 29న బజ్వా పదవీవిరమణ చేయాల్సి ఉంది. కానీ, ఇతడిపై అపార నమ్మకంతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మరో మూడేళ్లు సర్వీసును పొడిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు గత ఆగస్టు 29న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అప్పటికే మూడేళ్లు అదనపు సర్వీసు వల్ల ప్రధాని నిర్ణయాన్ని అక్కడి సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేవలం ఆరు నెలలకే అనుమతించింది. అంతేకాకుండా బజ్వా రీ అపాయింట్‌మెంట్‌పై పార్లమెంట్‌ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.

దీంతో కొన్నాళ్లు వేచి చూసిన పాక్‌ప్రభుత్వం ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకొని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవీ కాలాన్ని 60 నుంచి 64 ఏళ్లకు పెంచేందుకు అవసరమైన మూడు బిల్లులను దిగువ సభలో ప్రవేశపెట్టింది. ఎగువసభలోనూ ఇవి ఆమోదం పొందడం లాంఛనమే. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమైత్‌ ఉలేమా ఈ ఇస్లామ్‌ ఫజల్‌, జమత్‌ ఈ ఇస్లామి పార్టీలు వాకౌట్‌ చేశాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని