పాక్‌ ప్రధానిని ఆహ్వానించనున్న భారత్‌
close
Published : 17/01/2020 00:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ ప్రధానిని ఆహ్వానించనున్న భారత్‌

దిల్లీ: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను భారత్‌ షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎన్‌సీఓ) సదస్సుకు ఆహ్వానించనుంది. ఈ ఏడాది దిల్లీలో ఈ సదస్సు జరగనుంది. ఎస్‌సీఓలో పాకిస్థాన్‌ సభ్యదేశంగా ఉంది. ఈ సదస్సుకు ఎనిమిది సభ్య దేశాలు, నాలుగు అబ్జర్వర్‌ స్టేట్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ ప్రతినిధులను భారత్‌ ఆహ్వానించనుంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌సీఓలో సభ్యదేశమైన పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను ఆహ్వానించనుంది, గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్‌సీఓ సదస్సు విషయాన్ని ప్రస్తావించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వేదికగా కశ్మీర్‌ అంశాన్ని పాకిస్థాన్‌ లేవనెత్తడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాక్‌కు మద్దతుగా నిలిచిన చైనాకు భారత్‌ చురకలేసింది. ‘ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)లోని సభ్యదేశం ద్వారా పాక్‌ చేస్తున్న ప్రయత్నాలు హేయమైనవి. తన స్వలాభం కోసం పాక్‌ ఐరాస వేదికను దుర్వినియోగపరుస్తోంది. ద్వైపాక్షిక అంశాల ద్వారా పరిష్కారం కావాల్సిన అంశాలను ఐరాస వేదిక మీదకు తీసుకొస్తుంది. కానీ అందుకు యూఎన్‌ఎస్‌సీ సభ్యులు అభ్యంతరం తెలపడం హర్షణీయం. నిరాధార ఆరోపణలు చేసిన పాక్‌కు ఐరాసలో భారత్‌ గట్టి సమాధానం ఇచ్చింది. భారత్‌-పాక్‌కు సంబంధించిన ఎటువంటి అంశాలైన ద్వైపాక్షిక చర్చల ద్వారా జరగాల్సిందేననే విషయం మరోసారి కుండబద్ధలయ్యేలా ఆ దేశానికి చెప్పాం. భవిష్యత్‌లో ఇటువంటి చర్యలకు దూరంగా ఉండాలి’ అని కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి(ఎంఈఏ) రవీశ్‌ కుమార్‌ హెచ్చరించారు. ఐరాస సభ్యదేశాల ఆగ్రహాన్ని చైనా ఎదుర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆ దేశం పాఠాలు నేర్చుకోవాలని ఎంఈఏ హితవు పలికారు. 

భారత్‌లో ట్రంప్‌ పర్యటన..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నారు. గతంలో ట్రంప్‌తో మోదీ  భేటీ అయిన సమయంలో ఆయన్ను భారత్‌ రావాల్సిందిగా ప్రధాని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్నారు. దీనిపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.  

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని