పాక్‌  వైఖరి ప్రపంచానికి అర్థమైంది
close
Published : 23/01/2020 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌  వైఖరి ప్రపంచానికి అర్థమైంది

దిల్లీ: కశ్మీర్‌ సమస్య, ఈ విషయంలో మూడో పక్షం జోక్యం చేసుకునే విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా స్థిరంగా ఉందని భారత్‌ తేల్చి చెప్పింది. గురువారం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ మాట్లాడుతూ కశ్మీర్‌ వివాదం పరిష్కారానికి సహాయం చేస్తానంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కశ్మీర్‌ విషయంలో మూడో పార్టీ జోక్యం అవసరం లేదని పునరుద్ఘాటించారు. భారత్‌, పాక్‌ మధ్య ఉన్న ఏ వివాదమైన ద్వైపాక్షిక అంశాల ద్వారానే చర్చిస్తామని స్పష్టం చేశారు. దాయాది దేశం కశ్మీర్‌లో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని సృష్టించేందుకు ప్రయత్నించి విఫలమైందని ఆయన అన్నారు. పాక్‌ది రెండు నాలుకల ధోరణి అనే విషయాన్ని ప్రపంచానికి అర్థమైందని తెలిపారు.

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న ప్రాణాంతక వైరస్‌ కరోనాపై ఆయన స్పందించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ, ఆరోగ్య శాఖలు కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. చైనాలో ఉన్న భారత దౌత్యకార్యాలయ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. చైనా నుంచి భారత్‌ వచ్చే వారికి విమానాశ్రయాల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా పరీక్షలు చేస్తున్నామన్నారు. 
సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ బోగీల గురించి మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ బోగీలు ఇంకా పాకిస్థాన్‌ నుంచి తిరిగి రాలేదని వాటిని తిరిగివ్వమని అడుగుతున్నట్లు చెప్పారు. అవి వచ్చిన వెంటనే విషయాన్ని చెబుతామన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని