కరోనా గురించి ఆందోళన వద్దు... ఆదిత్యనాథ్‌
close
Published : 03/03/2020 23:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా గురించి ఆందోళన వద్దు... ఆదిత్యనాథ్‌

రుషికేశ్‌: మానసిక ఆందోళనను అధిగమిస్తే కరోనా వైరస్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ఏమీ చేయలేవని ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ అన్నారు. ఉత్తరాఖండ్లోని రుషికేశ్‌లో జరిగిన ఓ యోగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. శారీరిక, మానసిక ఆరోగ్యాలను కాపాడుకోవటానికి యోగా చక్కని మార్గమని వివరించారు. ‘‘మానసిక అనారోగ్యం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య. దీన్ని అధిగమిస్తే బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, లివర్‌ సమస్యలు ఇంకా కరోనా లాంటి వాటి నుంచి కూడా తప్పించుకోవచ్చు.’’ అని ఆదిత్యనాథ్‌ అన్నారు. కాగా కరోనావైరస్‌తో ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికిపైగా మృతి చెందారు. కాగా భారత్‌లో ఇప్పటి వరకు ఐదు కరోనా కేసులు నమోదు కాగా, వారిలో ఒకరు తెలంగాణాకు చెందిన వారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని