పాక్‌ డ్రోన్‌ను పేల్చేసిన భద్రతాదళాలు
close
Updated : 20/06/2020 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ డ్రోన్‌ను పేల్చేసిన భద్రతాదళాలు

కథువా: పాకిస్థాన్‌ కుయుక్తులను భద్రతా దళాలు మరోసారి తిప్పికొట్టాయి. దొంగదెబ్బ తీయాలని పాక్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు తెల్లవారుజామున 5.10 గంటల సమయంలో జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా పన్సార్‌ చెక్‌పోస్టు వద్ద పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ ఎగరడం గమనించిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమై కూల్చివేశారు. కూల్చివేసే సమయానికి డ్రోన్‌ భారత ప్రాదేశిక భూ భాగంలోకి 250 మీటర్ల మేర చొచ్చుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం డ్రోన్‌ను కూల్చివేసినట్లు చెప్పారు. అనంతరం డ్రోన్‌కు అమర్చిన అధునాతన రైఫిల్‌, రెండు మ్యాగజిన్లు, 60 రౌండ్ల తూటాలు, 7 గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఘటనాస్థలాన్ని సందర్శించిన బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. డ్రోన్‌ సాయంతో ఆయుధాల రవాణాకు చేసిన ప్రయత్నంగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పాక్‌ రేంజర్లు డ్రోన్‌ను నియంత్రించారని అధికారులు గుర్తించారు. ఈఘటనతో కథువా జిల్లాలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని