పాక్‌ కాల్పుల్లో ఆర్మీ జవాను మృతి
close
Updated : 22/06/2020 11:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌ కాల్పుల్లో ఆర్మీ జవాను మృతి

కశ్మీర్‌ : పాకిస్థాన్‌ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్‌ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను అమరుడయ్యారు. కృష్ణఘాటి, నౌషెరా సెక్టార్‌లో పాక్‌ బలగాలు భారీగా కాల్పులకు పాల్పడ్డాయి. పాక్‌ కవ్వింపు చర్యలకు భద్రతాబలగాలు దీటుగా బదులిచ్చాయి. తెల్లవారుజామున భారత్‌,పాక్‌ బలగాల మధ్య 3 గంటలపాటు కాల్పులు చోటుచేసుకున్నాయి.

సరిహద్దుల వెంట తరచూ కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్‌ తూట్లు పొడుస్తోంది. ఈ నెలలో పాక్‌ బలగాల కాల్పుల్లో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 

మరోవైపు అనంత్‌నాగ్‌ జిల్లా కాప్రాన్‌ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని