తాజ్‌హోటల్‌కు బాంబు బెదిరింపు!
close
Published : 30/06/2020 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాజ్‌హోటల్‌కు బాంబు బెదిరింపు!

పాక్‌ నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌కాల్‌

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయి‌లోని ప్రముఖ తాజ్ హోటల్‌‌కు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్‌ నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కరాచీ నుంచి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు గుర్తించామన్నారు. ఈ ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 2008లో ఉగ్రవాదులు ఇదే హోటల్‌ను లక్ష్యంగా చేసుకొని మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. 26/11 ఉగ్రదాడిగా పిలిచే ఈ ఘటనలో పలువురు విదేశీయులు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు, జమ్మూ-కశ్మీర్‌లో ఓ సైనిక క్యాంపుపై సోమవారం ఉగ్రమూకలు దాడికి దిగిన విషయం తెలిసిందే. అయితే తృటిలో పెను ప్రమాదం తప్పిందని.. సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మధ్య కశ్మీర్‌ జిల్లా బుద్గాంలోని ఛత్తర్‌గమ్‌లో ప్రాంతంలో ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన శిబిరంపై ముష్కరులు యూజీబీఎల్‌ గ్రెనేడ్‌ లాంఛర్లు వదిలినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అయితే అది లక్ష్యం తప్పి శిబిరానికి సమీపంలో పేలిందని దీంతో సైనికులకు ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ఘటనా ప్రాంతం నుంచి ఉగ్రవాదులు తప్పించుకు పోయారని.. వారిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని