ఆహారం భద్రంగా!
close
Published : 29/03/2020 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆహారం భద్రంగా!

మామూలు రోజుల్లో మాదిరిగా కాయగూరలు ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకోవడం కుదరడం లేదు. అందుకే ఒకేసారి తెచ్చుకున్న కూరలు పాడవకుండా వాటిని ఎక్కువ కాలం ఎలా నిల్వ చేసుకోవాలో చూద్దాం!

బఠానీలు, బ్రకోలీ, పాలకూర, తోటకూర, చిక్కుడుకాయ లాంటి కూరగాయలను ఫ్రీజర్‌లో భద్రపరిచే ముందు మరిగే నీటిలో అరనిమిషం పాటు వేసి తీయాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాతే జిప్‌లాక్‌ బ్యాగులు, డబ్బాల్లో వేసి ఫ్రీజర్‌లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.


టమాటాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. సూర్యకాంతి పడకుండా గది ఉష్ణోగ్రత వద్ద వీటిని ఉంచితే.. ఎక్కువకాలం తాజాగా ఉంటాయి.


పాలను డీప్‌ ఫ్రిజ్‌లో భద్రపరిస్తే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు.


ఏ పదార్థాన్నైనా మొదట చల్లార్చిన తరువాతే ఫ్రీజ్‌ చేయాలి. ఒకవేళ పదార్థం వేడిగా ఉంటే దాని ఉష్ణోగ్రత వల్ల మిగతావీ పాడయ్యే ప్రమాదం ఉంది.


మాంసం లాంటి వాటిని కూడా మొదట ఉడికించి, చల్లార్చిన తరువాతే శీతలీకరణం చేయాలి.


ఫ్రీజర్‌లో భద్రపరిచే ఆహారాన్ని గట్టిగా మూత ఉండే డబ్బాల్లో పెట్టుకోవాలి.


తురిమిన చీజ్‌ను కొద్దికొద్దిగా మఫిన్స్‌లో వేసుకుని ఫ్రీజర్‌లో నిల్వ చేసుకోవచ్ఛు పెరుగును కూడా ఇలాగే నిల్వ చేసుకోవచ్చు.

పచ్చళ్లుగా...

మాంసం, దోసకాయ, టమాటా, నిమ్మకాయ, కాలీఫ్లవర్‌, మామిడికాయ, బీట్‌రూట్‌... వీటిని వెనిగర్‌ లేదా నిమ్మరసం, మెంతిపొడి కలిపి, ఎక్కువ నూనె, ఉప్పు లేకుండా పచ్చళ్లుగా తయారుచేసుకుని కొన్నాళ్లపాటు నిల్వ చేసుకోవచ్చు.

ప్యూరీగా...

అరటి, బొప్పాయి, కమలా పండ్లను శుభ్రంగా కడిగి గుజ్జులా చేసి గాలిచొరబడని డబ్బాల్ల్లో భద్రపరుచుకుంటే సరి. కావాలనుకున్నప్పుడు స్మూథీలు, జ్యూస్‌లుగా చేసుకోవచ్చు.


బంగాళాదుంపలను సన్నటి చిప్స్‌లా కోసి... మరిగే నీటిలో నిమిషంపాటు ముంచి తీయాలి. ఆ తరువాత చల్లార్చి కాస్తంత నూనె రాసి ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు.


గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. వీటిని మొదట పగలగొట్టి ఒక గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి. ఆ తరువాత ట్రేల్లో పోసి ఫ్రీజర్‌లో భద్రపరుచుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని