ఎండకు గొడుగు పడతాయి
close
Published : 06/06/2020 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎండకు గొడుగు పడతాయి

ఎండ నుంచి శరీరాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ క్రీమ్‌ రాసుకుంటాం. అయితే ఆ క్రీమ్‌ ఒక్క ముఖాన్నే ఎండ బారి నుంచి కాపాడుతుంది. అలాకాకుండా మొత్తం శరీరాన్ని ఎండ, వేడి నుంచి కాపాడుకోవాలంటే...ఈ పండ్లు, కూరగాయలు తింటే మేలని అంటున్నారు పోషకాహార నిపుణులు... 

పుచ్చకాయ: దీంట్లో ఉండే లైకోపిన్‌ అతి నీలలోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అయితే ఎండలోకి వెళ్లడానికి ముందు ఒక్కసారి మాత్రమే పుచ్చకాయ జ్యూస్‌ తీసుకుంటే సరిపోదు. కొన్ని వారాలపాటు తాగితే లైకోపిన్‌ సహజసిద్ధంగా ఎండ నుంచి రక్షణ కల్పిస్తుంది.

డ్రై ఫ్రూట్స్‌: చియా విత్తనాలు, అవిసె గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. చర్మానికెంతో మేలు చేసే ఈ ఆమ్లాలు చేపలు, గుడ్లలోనూ ఉంటాయి. మన శరీరం స్వయంగా వీటిని తయారుచేసుకోలేదు కాబట్టి ఆహారం ద్వారానే తీసుకోవాలి. ఇవి చర్మాన్ని మెరిసేలా చేయడంతోపాటు మంటలనూ తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎండలో ఎక్కువ సమయం గడపాల్సి వచ్చినా ఇబ్బంది ఉండదు.

క్యారెట్లు, ఆకుకూరలు: వీటిలో అధికంగా ఉండే బీటాకెరొటిన్‌ సూర్యరశ్మి నుంచి సహజసిద్ధమైన రక్షణ కల్పిస్తుంది. పాలకూరలోనూ ఇది ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల ముడతలు మాయమవుతాయి. సూర్యరశ్శి వల్ల చర్మం కందిపోకుండా ఉంటుంది. అందుకే కూరలు, జ్యూస్‌ల రూపంలో రోజువారీ ఆహారంలో వీటిని భాగంగా చేసుకోవాలి.

చిలగడదుంపలు: బీటాకెరొటిన్‌ అధికంగా ఉండే వీటిని ఉడకబెట్టుకుని తినొచ్చు లేదా కూరలు, పులుసుల్లో వేసుకోవచ్చు. వీటిని విరివిగా ఉపయోగించడం వల్ల ఎండ వేడి నుంచి కాపాడుకోవచ్చు.
కాలీఫ్లవర్‌: దీంట్లో ఉండే అల్ఫాఅమైనో యాసిడ్‌ యూరోకానిక్‌ యాసిడ్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ యాసిడ్‌ అతి నీలలోహిత కిరణాల బారి నుంచి కాపాడుతుంది. దీంట్లో సూర్మరశ్మి నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

గ్రీన్‌టీ: ఎండ వేడి వల్ల చర్మానికి హాని జరగకుండా కాపాడుతుంది. చర్మానికి మేలుచేసే కొల్లాజెన్‌ అనే ప్రొటీన్‌ ఉత్పత్తిని పెంచుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని