గోరింట పండాలంటేే...
close
Published : 29/06/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోరింట పండాలంటేే...

ఆషాఢం వచ్చేసింది... అరచేతుల్లో గోరింటాకు విరబూయాలనీ, ఎర్రటిపూలతో ఆకట్టుకోవాలని ప్రతి అమ్మాయి మనసూ మురిసిపోతుంది. అసలింతకీ దీని వల్ల ప్రయోజనాలేంటి, అది ఎలా పండుతుంది?

గోరింటాకు ఎర్రగా పండాలని రసాయనాలతో చేసిన కోన్‌ల జోలికి పోవద్ధు ఆకుని తెచ్చి రుబ్బేటప్పుడు కాస్త చక్కెర, రెండు లవంగాలు వేయండి. గిన్నెలోకి తీసుకున్నాక ఆ మిశ్రమానికి నాలుగైదు చుక్కల యూకలిప్టస్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ని కలిపి పక్కనపెట్టండి. ఓ అరగంట గడిచాక గోరింటాకుని చేతులకు పెట్టుకోండి.

* గోరింటాకు ఎండిపోతే చక్కెర నిమ్మరసం కలిపిన సిరప్‌లో ముంచిన దూదితో అద్దండి. పెనంపై ఇంగువ వేడి చేసి ఆ పొగ చేతులకు తగలనివ్వండి.

* గోరింటాకు తీసేశాక లవంగ నూనెను చేతికి రాసుకుంటే చక్కటి రంగులోకి వస్తుంది.

ఇవీ ప్రయోజనాలు

* గోరింటాకుకి వేడిని తగ్గించే గుణం ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది.

* ఈ కాలంలో తడికి గోళ్లు, చర్మం పాడవకుండా గోరింటాకు పెట్టుకుంటే మంచిది. యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది.

* నువ్వుల నూనెలో గోరింటాకును మరిగించి తలకు రాసుకుంటే జుట్టు ఎదుగుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని