కలబంద తెచ్చే కళ!
close
Published : 02/08/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలబంద తెచ్చే కళ!

జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా కలబందతో పరిష్కారం చూపించొచ్ఛు ముఖ్యంగా చుండ్రూ, జుట్టుపొడిబారడం, నిర్జీవంగా మారడం, రాలిపోవడం వంటి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం చూపిస్తుంది.

తలస్నానం చేయడానికి పదినిమిషాల ముందు కలబంద గుజ్జుకి చెంచా ఆలివ్‌నూనె కలిపి కుదుళ్లతో సహా పట్టించాలి. ఈ జెల్‌లోని ఎంజైములు మృతకణాలని తొలగించి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని తొలగిస్తాయి. పీహెచ్‌ స్థాయిలని క్రమబద్ధీకరించి తగినంత తేమను అందించి జుట్టు పొడిబారకుండా చేస్తాయి.

* సాధారణంగా జుట్టు కుదుళ్ల నుంచి వెలువడే సహజసిద్ధమైన నూనెల్లో ప్రత్యేక అమైనో ఆమ్లాలు ఉంటాయి. అవి జుట్టు ఎదుగుదలకి కారణం అవుతాయి. అలాంటివే సుమారు ఇరవై రకాలు కలబందలోనూ దొరుకుతాయి. కాబట్టి జుట్టు రాలే సమస్య ఉన్నవారు కలబంద గుజ్జుని తలకు రాసుకోవచ్ఛు కప్పు కలబంద గుజ్జుకి, పావుకప్పు ఉసిరిపొడి, రెండు చెంచాల బాదం నూనె కలిపి తలకు ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా నెలలో రెండు సార్లు చేస్తే సరి మంచి ఫలితాలు ఉంటాయి.

* గుప్పెడు మందార పూలను మెత్తగా చేసుకుని కప్పు కలబంద గుజ్జులో కలిపి తలకు రాసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో తలస్నానం చేస్తే సరి...జుట్టు పట్టు కుచ్చులా మారుతుంది. అంతేకాదు ఒత్తుగా పెరుగుతుంది కూడా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని