సాన్నిహిత్యాన్ని మాటల్లోనూ చూపించొచ్చు...
close
Published : 02/04/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాన్నిహిత్యాన్ని మాటల్లోనూ చూపించొచ్చు...

‘భార్యాభర్తలు ఇలా ఉంటేనే సంతోషంగా ఉంటారని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే... అందరి కుటుంబ పరిస్థితులూ ఒకే రకంగా ఉండవు. కానీ కొన్ని విషయాలను గురించి తెలుసుకుంటే ఉన్నంతలో కాస్త సంతోషంగా గడపొచ్చు. అవేంటంటే...

దంపతుల సాన్నిహిత్యమనేది... పడక గదికి మాత్రమే పరిమితం అనుకుంటారు కొంతమంది. నిజానికి ఇది అపోహ మాత్రమే. ఉద్యోగరీత్యా కొంతమంది కుటుంబానికి దూరంగా గడపాల్సి రావచ్చు. అలాంటప్పుడు వేర్వేరుగా ఉంటున్నామని బెంగ పెట్టుకోనవసరం లేదు. వీలున్నప్పుడల్లా మాట్లాడుతూ సన్నిహితంగా ఉండొచ్చు. తరచూ మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల ప్రతి విషయాన్నీ పంచుకోగలుగుతారు. దీంతో ఒకర్ని విడిచి మరొకరు కొన్నివందల మైళ్ల దూరంలో ఉన్నారన్న ఆలోచనే రాదు.
ప్రయోగాలను మరిచిపోవద్దు...
కొత్త ప్రయోగాలను వంటగదికే పరిమితం చేస్తుంటారు కొందరు. అలాకాకుండా దాన్ని జీవితానికీ అన్వయించుకోవాలి. ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తే ఒకే పద్ధతిలో వెళుతుంటే... త్వరగా విసుగు వచ్చేస్తుంది. ఇది దంపతులకూ వర్తిస్తుంది. ఒకవారం ఇంటి పనులకు కేటాయించుకుంటే మరోవారం బయటకు వెళ్లడానికి ప్లాన్‌ చేసుకోవాలి. అలాగే గృహాలంకరణ విషయంలో కూడా ఏళ్ల తరబడి ఎలాంటి మార్పులూ చేయరు కొంతమంది. అలాకాకుండా ఇంటిని కొత్తగా అలంకరించడం వల్ల కూడా కంటికి వినూత్నంగా కనిపిస్తుంది. అంటే ఖరీదైన సామగ్రి కొనమని కాదు. ఉన్నవాటి స్థానాన్ని మార్చడం వల్ల కూడా ఇంటికి కొత్త అందం వస్తుంది. ఈ పనులన్నీ దంపతులు ఆలోచించి హాయిగా చేసుకోవచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని